Monday, January 4, 2016

సావిత్రిబాయి ఫూలే జయంతిని ఒక్క bta మాత్రమే జరపడాన్ని అధ్యాపక,ఉపాధ్యాయ మిత్రులందరు గమనించాలి

సావిత్రిబాయి ఫూలే జయంతిని ఒక్క bta మాత్రమే జరపడాన్ని అధ్యాపక,ఉపాధ్యాయ మిత్రులందరు గమనించాలి.
జెన్నీ మార్క్స్ గురించి, కొల్లెన్తాయి, రోజా లస్ఎంబెర్గ్ ల గురించి చెప్పే అనేక రకాల ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు సావిత్రి బాయి గురించి చెప్పవో ఆ సంఘాలలోని కార్యకర్తలు ఆలోచించాలి.
ఈ ఆలోచించే సాహసం కూడా మనకెందుకులే అనుకునే sc, st, bc, minority టీచర్ మిత్రులకి ఒక దండం.
నిజానికి రాధాకృష్ణన్ పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం భారత లౌకిక స్పృహకు గొడ్డలిపెట్టు. భారతదేశాన్ని హిందూదేశంగా పేర్కొన్న రాధాకృష్ణన్ ఈ దేశ భిన్నత్వ స్వభావాన్నే తిరస్కరించాడు. ఆ రీత్యా ఆయన ఈ దేశ శ్రామిక కులాల చరిత్రని కించపరిచాడు. కానీ సావిత్రి బాయి ఫూలే ఈ దేశంలోని ఉత్పత్తికులాల విద్య కోసం భర్త మహాత్మా ఫూలే తోడ్పాటుతో జీవితాంతం కృషి చేసింది. నిజానికి ఆధునిక భారత దేశంలోని మహిళా టీచెర్లందరికి స్ఫూర్తి సావిత్రి భాయి.
ఆమెను స్ఫూర్తిగా స్వీకరించడం లేదంటే కింది కులాల విద్యను నిరాకరించడం.
విద్య తప్ప మరే ఆస్తులు లేని జాతులను అవమానించడం.
సాటి మనుషులను అవమానించేవారెవరు టీచర్ జాబితాలోకి వచ్చే అవకాశం లేదు
 ఇక..సరస్వతీదేవి విగ్రహాన్ని స్కూల్స్ లో వేసే ఏ మనిషి అయినా కింది కులాల విద్యను వ్యతిరేకిస్తున్నట్టే.
ఇప్పుడు విచిత్రంగా వాళ్ళే వందేమాతరం వల్లే వేయించడం మానేసి గాయత్రీమంత్రం పఠింప చేస్తున్నారు. ఇది భారత దేశాన్ని అవమానించడం.
జనువరి 3ను జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించమని అడగడం చాలా చిన్న డిమాండ్. ఈ డిమాండ్ ను చేయడం ద్వారా bta ఒక ప్రజాస్వామిక స్వరం కోసం కేక వేస్తున్నది. 
ఈ డిమాండ్ చేయని సంఘాలను, సావిత్రి బాయి జయంతిని జరపని సంఘాలను తిరస్కరించడం ద్వారా మాత్రమే ఈ వర్గాల టీచర్లు తమ జాతిని గౌరవించిన వారవుతారు. 
3.1.16

No comments: